Hyderabad: హైదరాబాద్ జూపార్క్ లో ఘోరం... బ్యాటరీ కారు ఢీకొని బిడ్డ మృతి!

  • బ్యాటరీ కారు ఢీకొని తీవ్రగాయాలు
  • రెండు సంవత్సరాల అహ్మద్ మృతి
  • నిబంధనలు పాటించలేదని సిబ్బందిపై ఆరోపణలు

హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో జరిగిన విషాద సంఘటన రెండు సంవత్సరాల బిడ్డను బలిగొంది. పార్కులో సంచరించే ఓ బ్యాటరీ వాహనం ఢీకొనడంతో మొహమ్మద్ ఒమర్ సిద్ధిఖీ అహ్మద్ మృతి చెందాడు. తన తల్లిదండ్రులతో కలసి వచ్చి, సరదాగా ఆడుకుంటున్న బాలుడు, బ్యాటరీ కారు ముందుకు ఒక్కసారిగా వచ్చాడు. దాంతో ఆ కారు బాలుడిపై నుంచి వెళ్లిపోయింది.

వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. వాస్తవానికి జూ నిబంధనల ప్రకారం, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత బ్యాటరీ వాహనాలు తిరగకూడదు. సాయంత్రం 4 గంటల సమయంలో బ్యాటరీ కార్లు తిరగడంతోనే తమ బిడ్డ మరణించాడని అహ్మద్ తల్లిదండ్రులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News