Bollywood: సల్మాన్ ఖాన్ పెళ్లిపై జోక్ చేసిన కరణ్ జోహార్!

  • 2019లో సల్మాన్  తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు
  • అయితే, అమ్మాయిని మాత్రం కాదు
  • ‘నో ఫిల్టర్ నేహా’ కార్యక్రమంలో కరణ్

కొత్త సంవత్సరాలు వస్తున్నాయి.. వెళ్లిపోతున్నాయి. కానీ, బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ జీవితంలోకి ఓ అమ్మాయి రావట్లేదని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు సల్మాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించినట్టే రేకెత్తించి ఉసూరుమనిపించాయి.

 ఇంతకీ, కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు గురించి తెలుసుకుందాం. ‘నో ఫిల్టర్ నేహా’ అనే కార్యక్రమంలో పాల్గొన్న కరణ్, సల్మాన్ పెళ్లి గురించి మాట్లాడారు. బాలీవుడ్ నటి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో సల్మాన్ పెళ్లి గురించిన ప్రస్తావన ఆమె చేసింది. దీనికి, కరణ్ స్పందిస్తూ, '2019లో సల్మాన్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు.. కానీ, అమ్మాయిని మాత్రం కాదు, సల్మాన్ నటిస్తున్న మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను' అంటూ నవ్వులు చిందించారు. ఈ వ్యాఖ్యల ద్వారా సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయాన్ని కరణ్ చెప్పడం గమనార్హం.

Bollywood
Salman Khan
Karan Johar
no filter neha
  • Loading...

More Telugu News