Allu Arjun: పవన్ పిలుపు మేరకు తిత్లీ బాధితుల కోసం మరోసారి బన్నీ సాయం

  • గతంలో రూ.25 లక్షల సాయమందించిన బన్నీ
  • తాజాగా ఆర్వో ప్లాంట్లు, బోర్ వెల్
  • కొన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మరోసారి తిత్లీ బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. గతంలోనే పవన్ పిలుపు మేరకు రూ.25 లక్షల సాయమందించిన బన్నీ.. తాజాగా మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఒక బోర్ వెల్ వేయించేందుకు ముందుకు వచ్చాడు.

వీటి ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని దేవునలతడ, పొల్లాడి, అమలపాడు, కొండలోగం గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందనుంది. ఇప్పటికే అక్కడి ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని.. కాబట్టి నీటి పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ ఏర్పాటు చేయనున్నామని అల్లు అర్జున్ ప్రతినిధులు తెలిపారు.

Allu Arjun
Pawan Kalyan
Srikakulam District
Titly Cyclone
  • Loading...

More Telugu News