ys jagan: జగన్ ఒక్క అడుగు ముందుకేసి చూస్తే ఎప్పుడో సీఎం అయ్యేవాడు: టీడీపీ ఎంపీ జేసీ

  • మా వాడు జగన్ కు ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు!
  • జగన్ కు సీఎం అయ్యే యోగం లేదు
  • చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి

వైసీపీ అధినేత జగన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ‘మా వాడు జగన్ కు ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు! బుద్ధీ లేదు పాడూ లేదు! ఒక్క అడుగు ముందుకేసీ చూసి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు.. ఆ యోగం లేదు’ అని జోస్యం చెప్పారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే కనుక ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకుని ‘హాయి’గా నిద్రపోవచ్చు, వేరే వ్యక్తి ఎవరైనా సీఎం అయితే బెంగళూరుకో, మరెక్కడికన్నానో పోయి పనులు చేసుకోవాల్సిందేనని సెటైర్లు విసిరారు. ప్రజల భవిష్యత్ కోసం మళ్లీ టీడీపీనే గెలిపించాలని, చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

ys jagan
jc diwakar reddy
Telugudesam
YSRCP
Anantapur District
dharma porata deeksha
  • Loading...

More Telugu News