Nagaraju: తోటి ఉద్యోగినితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

  • టీసీఎస్‌లో టీం లీడర్‌గా పని చేస్తున్న నాగరాజు
  • రాధారాణితో వివాహేతర సంబంధం
  • ఆరు నెలలుగా ద్వారకానగర్‌లో కాపురం

కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేసి... తోటి ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని... పోలీసులకు అప్పగించింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన నాగరాజుకు అమూల్యతో 2007లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప. టీసీఎస్ కంపెనీలో టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు... తన టీం మెంబర్ అయిన రాధారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు.

రాధారాణితో కలిసి హైదరాబాద్‌లోని హస్తినాపురం ద్వారకానగర్‌లో ఆరు నెలలుగా వేరు కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న అమూల్య.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయ పడినా వినిపించుకోలేదని.. తనను, కూతురిని వదిలించుకునేందుకు నాగరాజు పథకం పన్నాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News