karthi: కార్తీ 'దేవ్' ఆడియో రిలీజ్ ఆ రోజునే!

  • కార్తీ హీరోగా రూపొందిన 'దేవ్' 
  • ఈ నెల 29వ తేదీన ఆడియో రిలీజ్ 
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్     

కార్తీ .. రకుల్ ప్రీత్ జంటగా 'దేవ్' సినిమా నిర్మితమైంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగును పూర్తిచేసుకుంది. హారిస్ జైరాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. జనవరి 25వ తేదీన గానీ .. ఫిబ్రవరిలో గాని ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. గతంలో కార్తీ .. రకుల్ జంటగా నటించిన 'ఖాకీ' తమిళంతో పాటు తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో సహజంగానే 'దేవ్' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో కార్తీ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News