Jagan: మా వాడు జగన్ సార్.. కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు!: టీడీపీ ఎంపీ జేసీ వ్యంగ్యం

  • ఈ రాష్ట్రానికి కులం పిచ్చి పట్టింది
  • రెడ్లం ఎంతమంది ఉన్నాం?
  • ఆరేడు పర్సెంట్ ఉంటే గొప్ప!

ఈ రాష్ట్రానికి కులం పిచ్చి పట్టిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ఒకాయన ‘రెడ్డి’ అని, మరో ఆయన ‘బలిజ’ అని, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడని అన్నారు. ‘మీరు ఒక్క కులంతో ముఖ్యమంత్రి అయ్యారా? రెడ్డి, కమ్మ, బలిజ..ఇలా అందరినీ కలుపుకుని వెళ్లారు కనుకే మీరు ముఖ్యమంత్రి అయ్యారు.

 ‘మావాడు జగన్ సార్.. కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు. రెడ్లం ఎంతమంది ఉన్నాం సార్? ఆరేడు పర్సెంట్ ఉంటే గొప్ప! మీరు ఎంతమంది ఉన్నారు? మా కంటే తక్కువ శాతం ఉన్నారు’ అంటూ వేదికపై ఉన్న చంద్రబాబును చూస్తూ ప్రసంగించారు. కాగా, జగన్ గురించి జేసీ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో చంద్రబాబు సహా అందరూ చిరునవ్వులు చిందించారు.

Jagan
Chandrababu
jc
Telugudesam
YSRCP
Anantapur District
caste
kamma
reddy
  • Loading...

More Telugu News