Poco F1 Armoured Edition: భారత్ లో విడుదలైన 'పోకో ఎఫ్1' ఆర్మర్డ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

  • ఫోన్ ధర రూ.23,999
  • ఫ్లిప్ కార్ట్ ,ఎంఐ ఆన్‌ లైన్ స్టోర్లలో లభ్యం 
  • ఎంఐ ఆన్‌ లైన్ స్టోర్లలో కొంటే ఇన్ స్టంట్ జియో క్యాష్ బ్యాక్

మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన స్మార్ట్ ఫోన్ 'పోకో ఎఫ్1' నుండి ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్ ని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.23,999 ధరకి లభించే ఈ ఫోన్ ని ఫ్లిప్‌ కార్ట్, ఎంఐ ఆన్‌ లైన్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. కాగా, ఎంఐ ఆన్‌ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనే వినియోగదారుల కోసం జియో సంస్థ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. రూ.2400 ఇన్స్టంట్ జియో క్యాష్ బ్యాక్ తో పాటు 6 టీబీ 4జీ డేటా ఉచితంగా పొందనున్నారు.

ప్రత్యేకతలు:

  • 6.18" డిస్ప్లే ( 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం
  • 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌ లాక్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జ్ 3.0 ఫాస్ట్ చార్జింగ్)

Poco F1 Armoured Edition
poco
smartphone
Tech-News
technology
Xiaomi
flipkart
MI store
  • Loading...

More Telugu News