Tech-News: టెక్‌, ఈ-కామర్స్‌ సంస్థల ఉద్యోగ మేళా.. 40 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

  • 30 శాతం ఉద్యోగులను పెంచుకునేందుకు సంస్థల యత్నం
  • ఉద్యోగ కల్పనలో టెక్ సంస్థలు 55 శాతం వృద్ధి 
  •  టెక్ సంస్థలు ఇప్పుడు రెట్టింపు

టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీలు, ఈ-కామర్స్‌ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా సరికొత్త పెట్టుబడులకు సిద్ధమవుతున్న సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. ఉద్యోగార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం.

 కార్స్‌ 24, మో ఎంగేజ్‌, ఇస్టామోజో, మిల్క్‌ బాస్కెట్‌, హెల్తియన్స్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 2018లో ఉద్యోగ కల్పనలో టెక్ సంస్థలు 55 శాతం వృద్ధి నమోదు చేశాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా ప్రస్తుతం చాలా సంస్థలు సొంత టెక్నాలజీ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వంటి సంస్థలు ముందున్నాయి. మార్కెట్లో పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓయో వంటి సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయని సమాచారం.

    2019లో టెక్‌ సంస్థల ద్వారా 40 వేల అదనపు ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్‌ ఉపాధ్యక్షుడు కె.ఎస్‌.విశ్వనాథన్‌ తెలిపారు. 2015తో పోలిస్తే టెక్‌ సంస్థలు రెట్టింపయ్యాయి. ఇవన్నీ చిన్న పట్టణాల్లోనూ సేవలు విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. మిల్క్ బాస్కెట్ తమ ఉద్యోగుల సంఖ్యను 3 వేలకు పెంచుకునేందుకు సిద్ధమవుతుండగా, హెల్తియన్స్‌ సంస్థ 150 మందిని, కార్స్‌24 సంస్థ 3 వేల మందిని ఉద్యోగాల్లికి తీసుకోనున్నాయి.

  • Loading...

More Telugu News