Nara Lokesh: సింగపూర్ కు మంత్రి లోకేశ్.. విమానం ముందు సెల్ఫీ తీసుకున్న మంత్రి!

  • లోకేశ్ కు నాథన్ ఫెలోషిప్ ప్రకటించిన సింగపూర్
  • అందుకునేందుకు బయలుదేరిన మంత్రి
  • ఇండిగో విమానం రద్దీపై కామెంట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ కు బయలుదేరారు. సింగపూర్ ప్రభుత్వం లోకేశ్ కు ప్రతిష్ఠాత్మక ఎస్.ఆర్.నాథన్ ఫెలోషిప్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని అందుకునేందుకు మంత్రి ఈరోజు ఉదయం విజయవాడ నుంచి ఇండిగో విమానంలో సింగపూర్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి ట్విట్టర్ లో స్పందించారు. విజయవాడ నుంచి వెళుతున్న విమానం రద్దీగా ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, విమానం ముందు సెల్ఫీ దిగి దానిని పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ మూడ్రోజుల పాటు సింగపూర్ లో ఉండనున్నారు.

Nara Lokesh
Telugudesam
singapore
selfie
minister
  • Loading...

More Telugu News