Chiranjeevi: నేను చిరంజీవిని ఏమీ అనలేదు.. నన్ను వదిలేయండి!: తమ్మారెడ్డి భరద్వాజ్

  • ఆయన స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి?
  • నేను ఓ సామాన్యుడిని
  • మంచి మాటలు చెప్పి బతుకుతున్నా

తనకూ, మెగాస్టార్ చిరంజీవికి మధ్య విభేదాలున్నాయంటూ యూట్యూబ్‌లో ప్రచారమవుతున్న విషయమై తాజాగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని.. తాను ఓ సామాన్యుడినంటూ వివరించారు.

‘‘నిన్న యూట్యూబ్‌లో ఓ వీడియో చూశా. నేను చిరంజీవిని ఏదో అన్నానని అందులో రిపోర్ట్ చేశారు. నేను ఆయన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. నాకు ఎవరితోనూ అభిప్రాయభేదాలు లేవు. ఆయనతో విభేదాలు రావడానికి నేను ఎవర్ని? ఆయన ఎక్కడ? నేను ఎక్కడ? ఆయన స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నేను ఓ సామాన్యుడిని. మీకు మార్కెట్‌ అవడానికి మా గురించి ఇలా చెడ్డగా రాయొద్దు. నన్ను వదిలేయండి.. నా అనుచరులకు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి బతుకుతున్నా’’ అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Tammareddy Bhardwaj
Youtube
Video
  • Loading...

More Telugu News