Aamir Khan: అమీర్ ఖాన్ తో తన గురించి వస్తున్న వార్తలపై ఫాతిమా సనా స్పందన

  • తప్పుడు వార్తలు రాసి, ఎలా నిద్రపోగలుగుతున్నారు
  • వార్తను చూసి నేను, అమ్మ ఎంతో బాధపడ్డాం
  • ఈ వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోంది

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో తనకు స్నేహానికి మించిన సంబంధం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసి, ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారని ఆమె ప్రశ్నించింది. ఈ వార్తలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

అమీర్ తో తనకు లింక్స్ ఉన్నాయనే వార్తను ఓ టీవీ చానెల్ లో ప్రసారం చేశారని... ఆ వార్తను చూసి తాను, అమ్మ ఇద్దరం చాలా బాధ పడ్డామని తెలిపింది. ఇలాంటి నిందలను చెరిపివేసుకునే బాధ్యత తమపైనే ఉంటుందని చెప్పింది. కోపాన్ని తట్టుకోలేకపోతే వార్త రాసిన వారిపై దాడి చేస్తామని... లేకపోతే సదరు వార్తపై క్లారిటీ ఇస్తామని తెలిపింది. తనకైతే ఈ తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోందని చెప్పింది.

Aamir Khan
fathima sana shaik
bollywood
  • Loading...

More Telugu News