Ashok Gajapathi Raju: కొందరు శాసనసభకు డుమ్మా కొడుతున్నారు: అశోక్ గజపతిరాజు

  • ప్రజల దాహార్తిని తీరుస్తాం
  • రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తాం
  • మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తాం

తోటపల్లి ప్రాజెక్టు నీటితో ప్రజల దాహార్తిని తీరుస్తామని టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడించారు. నేడు ఆయన విజయనగరంలోని మున్సిపల్ కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ.. కొందరు నేతలు శాసనసభకు డుమ్మా కొడుతున్నారని, పని చేయడం మానేస్తే వారిని పని దొంగలంటారని ఎద్దేవా చేశారు. త్వరలోనే విజయనగరం రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్టు అశోక్ గజపతి రాజు తెలిపారు. వర్షాలు లేకపోవడంతో వచ్చే వేసవిలో నీటి కష్టాలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.   

Ashok Gajapathi Raju
Telugudesam
Vijayanagaram
Railway station
Thotapalli Project
  • Loading...

More Telugu News