Polavaram Project: సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేందుకు ప్రభుత్వానికి తీరిక లేదు: పొంగులేటి

  • చంద్రబాబు చెబితే నమ్మే పరిస్థితి లేదు
  • కేసీఆర్ మాట తప్పారు
  • పునర్విభజన చట్టం అమలులో విఫలం

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెబితే తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తీరిక లేదని విమర్శించారు.

అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్తానన్న కేసీఆర్ మాట తప్పారని.. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం డిమాండ్ చేయాలని పొంగులేటి కోరారు. తామేమీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ముంపు నుంచి భద్రాద్రిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పునర్విభజన చట్టం అమలులో కేంద్రం విఫలమైందని పొంగులేటి ఆరోపించారు.

Polavaram Project
Ponguleti sudhakar Reddy
Chandrababu
Supreme Court
  • Loading...

More Telugu News