Uttam Kumar Reddy: కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడం అన్యాయం
  • జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను కల్పించండి
  • ఓట్లు కోల్పోయిన వారికి తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి

త్వరలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. హైకోర్టు తీర్పు ప్రకారం కుల గణన చేపట్టాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం కుల గణన చేపట్టాలని... జనాభా లెక్కల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతైన వారికి తిరిగి ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Uttam Kumar Reddy
kcr
pachayat
elections
reservations
TRS
congress
  • Loading...

More Telugu News