vajpayee: ఉత్తరప్రదేశ్, బీహార్ లలో వాజ్ పేయి విగ్రహాల ప్రతిష్ఠకు నిర్ణయం

  • వాజ్ పేయి 94వ జయంతి నేడు
  • దేశ వ్యాప్తంగా జయంతి వేడుకలు
  • వాజ్ పేయి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు యోగి, నితీష్ ల ప్రకటన

మాజీ ప్రధాని వాజ్ పేయి 94వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. మరోవైపు, వాజ్ పేయి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు నిర్ణయించాయి. లక్నోలోని లోక్ భవన్ లో 21 మీటర్ల ఎత్తైన వాజ్ పేయి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మరోవైపు, బీహార్ రాజధాని పాట్నాలో వాజ్ పేయి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. అయితే, పాట్నాలో విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్న సంగతిని నితీష్ వెల్లడించలేదు.

vajpayee
statue
Uttar Pradesh
bihar
yogi adityanath
nitish kumar
  • Loading...

More Telugu News