Chandrababu: చంద్రబాబాబును కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. వర్ల రామయ్య ఫిర్యాదు

  • మాట్లాడని మాటలను మార్ఫింగ్ చేశారు
  • చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు
  • సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలి

ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మాట్లాడని మాటలను మార్ఫింగ్ చేసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసినట్టుగా పోస్టులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ సామాజిక వర్గానికే పని చేస్తామని చంద్రబాబు చెప్పినట్టుగా వీడియోను మార్ఫింగ్ చేసి తప్పుడు పోస్టులు పెడుతున్నారని వర్ల ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Chandrababu
Varla Ramaiah
Vijayawada
Social Media
  • Loading...

More Telugu News