kcr: 2006లోనే కేసీఆర్ కు ఆ ఆలోచన వచ్చింది: ఎంపీ వినోద్

  • కేంద్రంలో ఎన్డీయే లేదా యూపీఏ మాత్రమే అధికారంలో ఉండే పరిస్థితి ఉంది
  • ప్రాంతీయ పార్టీల అండతో జాతీయ పార్టీలు పెత్తనం చలాయిస్తున్నాయి
  • ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఉన్నందునే సమస్యలు పరిష్కారం కావడం లేదు

కేంద్రంలో ఎన్డీయే లేదా యూపీఏ మాత్రమే అధికారంలో ఉండే పరిస్థితి ఉందని... ఈ పరిస్థితులను మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అధికార పార్టీ విఫలమైతే తమకే అధికారం వస్తుందనే ధీమాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని చెప్పారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో బీజేపీ, కాంగ్రెస్ లు విఫలమయ్యాయని... అందుకే దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీల అండతో జాతీయ పార్టీలు అధికారాన్ని చలాయిస్తున్నాయని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారని వినోద్ చెప్పారు. వాస్తవానికి, 2006లోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కేసీఆర్ కు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందని... దాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఉన్నందునే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News