Chandrababu: చంద్రబాబు పక్కన నిలబడి విజిల్ వేసిన టీడీపీ నేత

  • పోలవరం ప్రాజెక్టుకు గేట్ల బిగింపు ప్రారంభం
  • చంద్రబాబును సత్కరించిన పీఏసీఎస్ అధ్యక్షుడు బెనర్జీ
  • విజిల్ వేసి, ఆంధ్ర సింహమని కొనియాడిన టీడీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర సింహమని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి టీడీపీ గ్రామాధ్యక్షుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు లంకబాబు సురేంద్రమోహన్ బెనర్జీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గేట్ల బిగింపును ప్రారంభించిన సందర్భంగా, చంద్రబాబును ఆయన కలిశారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కన నిలబడి గట్టిగా విజిల్ వేసి, ఆంధ్ర సింహమని కొనియాడారు. మరోవైపు, ముఖ్యమంత్రి సహాయనిధికి గతంలో సురేంద్ర విరాళాలను అందజేశారు.

Chandrababu
surendra mohan banerjee
Telugudesam
polavaram
  • Loading...

More Telugu News