Guntur District: జనవరి 6న ఏపీకి తీపికబురు చెప్పనున్న నరేంద్ర మోదీ!

  • 6న గుంటూరులో బీజేపీ సభ
  • ప్రజలు శుభవార్తను వింటారన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు
  • చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమని వ్యాఖ్య

వచ్చే నెల 6వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న సభకు వస్తున్న నరేంద్ర మోదీ, ఏపీ ప్రజలకు తీపి కబురును చెప్పనున్నారా? అంటే, అవుననే అంటున్నారు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రమేష్‌ నాయుడు. ప్రజలకు మంచి వార్తను చెప్పేందుకే ఆయన ఏపీకి వస్తున్నారని మదనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.

ఇక ఆ తీపికబురు ప్రత్యేక హోదా గురించేనా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తాను కచ్చితంగా చెప్పలేనని, ఏదిఏమైనా చాలా పెద్ద వార్తనే వింటారని అన్నారు. ఏపీకి ఇచ్చినన్ని కేంద్ర నిధులు మరే రాష్ట్రానికీ రాలేదని, ఎన్డీయే సర్కారు ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు. మోదీ ఏపీకి వస్తుంటే భయపడుతున్న చంద్రబాబు, తన అనుచరులతో నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆరోపించిన రమేష్ నాయుడు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Guntur District
Narendra Modi
Andhra Pradesh
Special Category Status
  • Loading...

More Telugu News