Pulivendula: జగన్ తో ప్రజాసేవ చేయించాలని దేవుడు నిర్ణయించాడు: వైఎస్ విజయమ్మ

  • అందుకే హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు
  • పాదయాత్రలో జగన్ కు తోడుగా నిలిచిన దేవుడు
  • పులివెందుల చర్చ్ లో వైఎస్ విజయమ్మ

జగన్ తో ప్రజాసేవ చేయించాలని దేవుడు నిర్ణయించాడని, అందువల్లే హత్యాయత్నం నుంచి తన బిడ్డ బయట పడ్డాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. పులివెందులలోని చర్చ్ లో నేడు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, పాదయాత్రలో నిత్యం దేవుడు జగన్ కు తోడుగా ఉండి కాపాడుతున్నాడని అన్నారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించిన సుపరిపాలనను జగన్ కూడా అందిస్తారని చెప్పారు. దేవుని ఆశీర్వాదం వల్ల వైఎస్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించిన ఆమె, రాబోయే రోజుల్లో జగన్ లక్ష్యాన్ని దేవుడు నెరవేరుస్తాడని అన్నారు. వైఎస్ జగన్ కోసం ప్రార్థిస్తున్న కోట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు విజయమ్మ.

Pulivendula
YS Vijayamma
Jagan
Christmas
  • Loading...

More Telugu News