nagababu: ఏడాదిగా తమ్ముడికి ఏమన్నా చేద్దామంటే కుదర్లేదు..ఈరోజు నాకు మనశ్శాంతిగా ఉంది : నాగబాబు
- మన మేమీ చేయలేకపోతున్నామని వరుణ్ అన్నాడు
- వరుణ్, నేను కలిసి ఇచ్చిన చిన్న కంట్రిబ్యూషనిది
- భవిష్యత్ లో ఇంకా చేసే ఆలోచన ఉంది
జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నిర్మాత నాగబాబు రూ.25 లక్షలు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందిస్తూ, తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘రాజకీయాల విషయమై మా తమ్ముడితో పాటు దిగి ఏదన్నా చేద్దామంటే కుదర్లేదు. వరుణ్ బాబు కూడా అదే అన్నాడు. ‘నాన్నా, బాబాయ్ అంత కష్టపడుతున్నాడు.. మన మేమీ చేయలేకపోతున్నాం. ఏదోఒకటి చేయాలి నాన్నా. నాకేమో షూటింగ్ లు ఉన్నాయి. నువ్వేమో చేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఏదన్నా చేద్దాం నాన్న’ అంటూ తనయుడు హీరో వరుణ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు.
‘ఏం చేయలేకే, వరుణ్ బాబు, నేను కలిసి ఇచ్చిన ఈ చిన్న కంట్రిబ్యూషన్ ఫర్ జనసేన పార్టీ. ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేయాలని అన్నీ వదిలేసుకుని వచ్చిన మా తమ్ముడికి ఇది చిన్ని కంట్రిబ్యూషన్. మా కంట్రిబ్యూషన్ ఇక్కడితో ఆగదు. భవిష్యత్ లో ఇంకా కొంత చేసేందుకే ఆలోచిస్తున్నాం. కల్యాణ్ బాబుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే..కల్యాణ్ బాబు పార్టీకి మా వంతుగా చిన్న విరాళం ఇవ్వడమనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం. గత ఏడాదిగా నేను ఏమీ చేయలేకపోతున్నానన్న బాధగా ఉంది. ఈరోజు మనశ్శాంతిగా ఉంది... థ్యాంక్యూ, జై జనసేన" ఛి చెప్పారు.
చివరిగా చేతిలో వున్న గాజు గ్లాసుతో టీ తాగుతూ, 'దీంట్లో తాగితే ఆ టేస్టే వేరబ్బా’ అన్నారు నవ్వేస్తూ.