Pawan Kalyan: కామన్ మ్యాన్ కు దగ్గరగా ఉండే గ్లాసు ఇది.. ‘జై జనసేన’!: నాగబాబు

  • ‘చూడటానికి గాజు గ్లాసు సింపుల్ గా ఉంటుంది
  • కాఫీ గానీ టీ గానీ ఈ గ్లాసులో తాగితేనే ఆ టేస్ట్
  • మరి, ఏ గ్లాసులో తాగినా అంత టేస్ట్ ఉండదు

జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘గాజు గ్లాసు’ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు కేటాయించడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నిర్మాత నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

గాజు గ్లాసులో టీ తాగుతూ, నాగబాబు మాట్లాడుతూ, ‘చూడటానికి గాజు గ్లాసు సింపుల్ గా ఉంటుంది. కాఫీ గానీ టీ గానీ ఈ గ్లాసులో తాగితేనే ఆ టేస్ట్ ఉంటుంది. మరే ఇతర గ్లాసులో తాగినా అంత టేస్ట్ ఉండదు. అందుకే, కామన్ మ్యాన్ కు దగ్గరగా ఉండే గ్లాసు ఇది.. జై జనసేన. ఫస్ట్ థ్యాంక్స్ టూ మై లిటిల్ బ్రదర్ కల్యాణ్ బాబు... మా తమ్ముడు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయం, పది మందికి ఉపయోగపడాలని రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం, గ్రేటర్ కాజ్ కోసం ప్రజల్లోకి వెళ్లి కష్టపడుతున్నాడు’ అని పవన్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News