Andhra Pradesh: నరేంద్ర మోదీపై మంత్రి గంటా మండిపాటు!

  • ఏపీకి వచ్చే నైతిక హక్కు లేదు
  • ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
  • తిరుమలలో మీడియాతో గంటా

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నైతిక హక్కు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, జనవరి 6న గుంటూరుకు మోదీ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

గడచిన ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని మండిపడ్డ ఆయన, ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే రాష్ట్రంలోకి మోదీ అడుగు పెట్టాలని అన్నారు. కాగా, గంటాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందించారు.

Andhra Pradesh
Tirumala
Ganta Srinivasa Rao
Narendra Modi
  • Loading...

More Telugu News