chiranjeevi: చరణ్ మూవీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి

  • రేపటితో షూటింగ్ పార్ట్ పూర్తి 
  • ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • జనవరి 11న సినిమా రిలీజ్  

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లో జరుగుతోంది. చరణ్ తో పాటు భారీ సంఖ్యలో డాన్సర్లు పాల్గొనగా ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. రేపటితో ఈ పాట చిత్రీకరణతో పాటు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకానున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

 కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో చరణ్ ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనేది అభిమానుల మాట. 

  • Loading...

More Telugu News