Mumbai: మరో లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు... వీడియోలు ఎందరికో పంపించిన యజమాని!

  • ముంబైలో వెలుగులోకి వచ్చిన ఘటన
  • అడాప్టర్ లో సీక్రెట్ కెమెరా
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తమిళనాడులో, కర్ణాటకలో లేడీస్ హాస్టల్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి యువతుల దృశ్యాలను చిత్రీకరించిన ప్రబుద్ధుల బాగోతాన్ని మరువకముందే ముంబైలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని అప్ మార్కెట్ లో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి, ఇతరులకు పంపించాడో దుర్మార్గుడు. నాలుగు బెడ్ రూములున్న ప్లాట్ ను హాస్టల్ మాదిరి మార్చి, ముగ్గురిని పేయింగ్ గెస్టులుగా చేర్చుకుని, వారి గదిలో అమర్చిన అడాప్టర్ లో సీక్రెట్ కెమెరాను ఉంచాడు.

ఆపై వారి కదలికలను తన మొబైల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ఓ అమ్మాయి అడాప్టర్ పై తన వస్త్రాన్ని కప్పగా, తనిఖీ పేరిట గదిలోకి వచ్చిన యజమాని, వస్త్రం ఎందుకు కప్పావని ప్రశ్నించడంతో అమ్మాయిలకు అనుమానం వచ్చింది. ఆపై వారు పరిశీలించి చూసి, పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్ లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అన్నారు.

Mumbai
Ladies Hostel
Secret Camera
  • Loading...

More Telugu News