KCR: కేసీఆర్ మనవడు హిమాన్షు చేయూతనందించిన దివ్యాంగుడు మృతి!

  • ఎన్నికల వేళ కేసీఆర్ తిరిగి సీఎం కావాలని కోరిన శ్రీనివాసరావు
  • అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స చేయిస్తున్న హిమాన్షు
  • ఆరోగ్యం విషమించి శ్రీనివాసరావు కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మనవడు హిమాన్షు స్వయంగా స్పందించి చికిత్స చేయిస్తున్న దివ్యాంగుడు నూకసాని శ్రీనివాసరావు మరణించాడు. అసెంబ్లీ ఎన్నికల వేళ, కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నానని, తనకు ఆరోగ్యం బాగాలేదని, పెన్షన్ మంజూరు చేయించాలని శ్రీనివాసరావు సోషల్ మీడియాలో విన్నవించుకోగా, హిమాన్షు దాన్ని చూసి, భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిలో అతన్ని చేర్పించేలా చూశాడు.

మెరుగైన వైద్య చికిత్స కోసం శ్రీనివాసరావును హైదరాబాద్ తరలించాలని సిఫార్సు చేసిన వైద్యులు, ఆ ప్రయత్నాల్లో ఉండగానే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీనివాసరావు మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 

KCR
Grand Son
Himanshu
Handicaped
Died
Bhadrachalam
  • Loading...

More Telugu News