BJP: మేం అధికారంలోకి వస్తే మీ యూనిఫాంలు విప్పిస్తాం.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు
  • కేసులు పెట్టిన పోలీసులందరినీ గుర్తించాం
  • వారందరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన ఆయన.. తాము కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పోలీసుల యూనిఫాంలు విప్పిస్తామని హెచ్చరించారు. వారు యూనిఫాం ధరించడానికి ఎంతమాత్రమూ అర్హులు కాదన్నారు. తాము ప్రతీ ఘటనను రికార్డు చేస్తున్నామని, బీజేపీ కార్యకర్తలపై ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వారందరినీ గుర్తించినట్టు చెప్పారు. చేసిన తప్పుకు తిరిగి వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

BJP
West Bengal
Dilip Ghosh
Police
uniform
mamata banerjee
  • Loading...

More Telugu News