Swaroopanandendra: నేను చెప్పిన తరువాతే సుబ్రహ్మణ్యస్వామి కోర్టుకెక్కారు: స్వరూపానందేంద్ర

  • సుబ్రహ్మణ్యస్వామి నా శిష్యుడే
  • అర్చక వ్యవస్థలో కల్పించుకునే అధికారం ఎవరికీ లేదు
  • శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనకు శిష్యుడని, తాను సూచించిన తరువాతనే అర్చకుల వ్యవస్థపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేశారని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు. అర్చకుల వ్యవస్థలో కలుగజేసుకునే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడ్డ ఆయన, అర్చకత్వం ఓ వృత్తి అని, దీనికి పదవీ విరమణ వయసును ప్రకటించడం అత్యంత దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్చక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించిన ఆయన, అర్చకుల రిటైర్ మెంట్ నిబంధనను తప్పుపడుతూ, హైకోర్టు గొప్ప తీర్పిచ్చిందని తెలిపారు.

Swaroopanandendra
Sarada Peetham
TTD
Subrahmanya Swamy
  • Loading...

More Telugu News