Election commission: పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి... రేపటి నుంచి ఓటు నమోదుకు ఈసీ శ్రీకారం

  • రేపు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • కొత్త ఓటర్లకు అవకాశం
  • జనవరి 25 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తం అవుతోంది. బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయనుంది. అందులో పేర్లు లేని వారితోపాటు, జనవరి 1తో 18 ఏళ్లు నిండిన వారు తమ  ఓటును నమోదు చేసుకోవచ్చు. బుధవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈసీ అభ్యంతరాలను స్వీకరించనుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించనుంది. అనంతరం అదే నెల 18న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 22న తుది జాబితా విడుదలవుతుంది. ఇదే జాబితా ప్రకారం లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనుంది. ఓటర్ల సవరణ జాబితాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితాలో తమ పేరు ఉన్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు  http://ceotelangana.nic.in వెబ్‌సైట్‌‌లో కానీ, లేదంటే 9223166166/51969 నంబర్లకు ‘TSVOTEVOTERID NO’ అని ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కానీ చెక్ చేసుకోవచ్చు.

Election commission
Telangana
Voter list
Lok Sabha
  • Loading...

More Telugu News