Telugudesam: ఏపీలో వైసీపీకి 14, టీడీపీ+కాంగ్రెస్ కు 11.. తెలంగాణలో టీఆర్ఎస్ ఫుల్ స్వీప్: రిపబ్లిక్ టీవీ లోక్ సభ ప్రీ పోల్ సర్వే

  • తెలంగాణలో మహాకూటమి ఓటమి ఎఫెక్ట్ ఏపీలో ఉండదు
  • కాంగ్రెస్, టీడీపీల కూటమి వైసీపీ సీట్లను తగ్గిస్తుంది
  • తెలంగాణలో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుపొందుతుంది

దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా అయిన రిపబ్లిక్ టీవీ తన సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను 14 చోట్ల వైసీపీ గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. మిగిలిన 11 స్థానాలను టీడీపీ, కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పింది. మొన్నటి వరకు జగన్ పార్టీకి అనుకూలంగా వార్ వన్ సైడ్ గా ఉందని... కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టిన తర్వాత చంద్రబాబు మళ్లీ లైన్ లోకి వచ్చారని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి ప్రభావం ఏపీలో ఉండదని పేర్కొంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతోందని రిపబ్లిక్ టీవీ తెలిపింది. మొత్తం 17 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పింది. మిగిలిన ఒక స్థానం ఎంఐఎం ఖాతాలో పడుతుందని పేర్కొంది. 

Telugudesam
TRS
mim
congress
parliament elections
survey
results
republic tv
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News