jitender reddy: కార్యకర్తల సమావేశంలో.. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డికి నిరసన సెగ

  • మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నిరసనలు
  • చిట్టెం రాంమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేయలేదని మండిపాటు
  • గో బ్యాక్... అంటూ నినాదాలు

టీఆర్ఎస్ ఎంపీ, లోక్ సభలో ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరులో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఈరోజు జరిగింది. ఆ కార్యక్రమానికి జితేందర్ రెడ్డి హాజరయ్యారు. అయితే, ఆయనకు వ్యతరేకంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాంమోహన్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయలేదని మండిపడ్డారు. 'జితేందర్ రెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. 

jitender reddy
TRS
protest
maktal
  • Loading...

More Telugu News