giriraj singh: మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4d6906e2180fded616d0cd9e2dd344de369cc0f6.jpg)
- ఉత్తర కొరియా అధ్యక్షుడితో మమతను పోల్చిన గిరిరాజ్
- కిమ్ లాగానే మమత వ్యవహరిస్తున్నారు
- వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపేస్తున్నారు
తమ పార్టీ అధ్యక్షుడు తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో మమతను పోల్చారు. కిమ్ లా మమత వ్యవహరిస్తున్నారని... ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని చంపేస్తున్నారని మండిపడ్డారు. కాగా, రథయాత్రకు సంబంధించిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని... దీన్ని కూడా సాధారణ పిటిషన్ గానే భావిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.