tanikella bharani: ఒకే ఒక్కసారి అప్పు చేసి చాలా బాధపడ్డాను: తనికెళ్ల భరణి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-3e5f9454c7b2cd7887ac50ec0d55b9a1995224ab.jpg)
- మాది చాలా పెద్ద కుటుంబం
- నాన్నకి అప్పంటే తెలియదు
- కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చాడో
ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ తణికెళ్ల భరణి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి భరణి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మాది చాలాపెద్ద కుటుంబం .. మేము ఏడుగురం అన్నదమ్ములం. మా నాన్నకి 750 రూపాయల జీతం వచ్చేది. అంత మొత్తంతో ఇంత పెద్ద కుటుంబాన్ని మా నాన్న ఎలా నెట్టుకొచ్చాడు అనేదే ఇప్పటికీ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆయన ఎప్పుడూ అప్పు చేసి ఎరుగడు .. అప్పు అంటేనే అసలు ఆయనకి తెలియదు. అదే అలవాటు మా అన్నదమ్ములందరికీ వచ్చింది. మాలో ఎవరూ అప్పుచేసి ఎరుగరు. ఒకానొక సందర్భంలో మాత్రం నేను అప్పు చేయవలసి వచ్చింది. అప్పు చేయకూడదనే ఒక పద్ధతిని దాటినందుకు నేను చాలా బాధపడిపోయాను. ఆ తరువాత నుంచి మళ్లీ అప్పు చేసింది లేదు" అని చెప్పుకొచ్చారు.