Sachin Tendulkar: సచిన్ తో కోహ్లీని పోల్చాల్సిన పని లేదు: కుంబ్లే

  • ఆధునిక యుగంలోని క్రికెటర్ కోహ్లీ
  • సచిన్ ఉన్న సమయం, పరిస్థితులు వేరు
  • కోహ్లీకి ఎంతో భవిష్యత్తు ఉంది

టీమిండియా కెప్టెన్ కోహ్లీపై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. ఆధునిక యుగంలో ఉన్న క్రికెటర్ కోహ్లీ అని అన్నారు. వివాదాల నుంచి బయటపడటం కోహ్లీకి తెలుసని చెప్పారు. కోహ్లీలోని ప్రతిభ అత్యున్నత స్థాయిలో ఉంటుందని... మ్యాచ్ లోని ఎలాంటి పరిస్థితులనైనా తన అధీనంలోకి తీసుకురాగలడని తెలిపారు.

సచిన్ తో కోహ్లీని పోల్చడాన్ని తాను సమర్థించనని చెప్పారు. ఒకటి, రెండు ఘటనల ఆధారంగా సచిన్ తో పోల్చడం సరికాదని అన్నారు. సచిన్ ఉన్న సమయం, పరిస్థితులు వేరని... ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు. ఇద్దరినీ పోల్చాల్సిన అవసరం లేదని అన్నారు. కోహ్లీకి ఎంతో భవిష్యత్తు ఉందని... ఎన్నో రికార్డులను సృష్టించగలడని తెలిపారు.

Sachin Tendulkar
Virat Kohli
anil kumble
team india
  • Loading...

More Telugu News