kcr: ఏపీలో కేసీఆర్ ప్రచారంపై మల్లు భట్టివిక్రమార్క స్పందన

  • దేశంలో ఎవరు, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు
  • రాజ్యాంగం ఆ అధికారాన్ని కల్పించింది
  • కేసీఆర్ ప్రచార ఫలితాన్ని ప్రజలు నిర్ణయిస్తారు

తెలంగాణ ఎన్నికల్లో తమకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీకాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. ఈ రోజు ఆయన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించాలని ప్రార్థించానని చెప్పారు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని, రాజ్యాంగం ఆ అధికారాన్ని కల్పించిందని తెలిపారు.  ఏపీలో కేసీఆర్ ప్రచారం చేస్తే... దాని ఫలితం ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

kcr
ap
TRS
Mallu Bhatti Vikramarka
Tirumala
  • Loading...

More Telugu News