wifes friend: భార్య స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
  • యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం
  • వీడియో షూట్ చేసి బ్లాక్ మెయిల్

భార్య స్నేహితురాలిపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా వీడియోను చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులో గత నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన సిలంబరసన్‌ (22)కు  షర్మిల అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహమయింది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు. షర్మిల స్నేహితురాలు(24) వీరి ఇంటికి తరచుగా వచ్చేది. ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన సిలంబరసన్ ఆమెను లొంగదీసుకునేందుకు ప్లాన్ వేశాడు. ఓ రోజు భార్య లేని సమయంలో సదరు యువతి ఇంటికి రాగా, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం మత్తులోకి జారుకున్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను ఫోన్ లో షూట్ చేశాడు.

ఈ వీడియో ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పర్యవసానంగా గర్భం దాల్చిన బాధితురాలు గత నెల 21న మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో సిలంబరసన్ బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై పలుమార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని గుమ్మిడిపూండి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

wifes friend
Crime News
rape
video shoot
Police
arrest pregnent
cool drink
sedatives
  • Loading...

More Telugu News