byreddy rajasekhar reddy: చంద్రబాబు, జగన్ లపై.. పోటీకి నేను రెడీ: బైరెడ్డి

  • టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది
  • ఏపీలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాం
  • జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నాం

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఏపీ కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరపున బస్సు యాత్రను జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నామని... శ్రీశైలం నుంచి యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. క్రిస్మస్ కానుకల పేరిట దళిత ప్రజలకు చేరువయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... ఆయన కుయుక్తులను ఎవరూ నమ్మరని అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే... కుప్పం (చంద్రబాబు), పులివెందుల (జగన్)లలో పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు.

byreddy rajasekhar reddy
congress
kuppam
pulivendula
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News