Puri: పూరీలో కేసీఆర్ ను చూసి కేరింతలు కొట్టిన తెలుగువారు!

  • పూరీ జగన్నాథుని ఆలయంలో తెలంగాణ సీఎం
  • కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ప్రత్యేక పూజలు
  • ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు

తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కేసీఆర్, నేడు పూరీలోని జగన్నాథ ఆలయానికి వెళ్లిన వేళ, అక్కడాయన్ను చూసిన తెలుగు వారు కేరింతలు కొట్టారు. ఈ ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి రాగా, అధికారులు సంప్రదాయ స్వాగతం పలికారు.

కుటుంబసభ్యులతో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కేసీఆర్ ను చూసేందుకు భక్తులు, సమీపంలోని తెలుగు ప్రజలు అక్కడికి పెద్దఎత్తున తరలివచ్చారు. కేసీఆర్ సైతం వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పూరీ సందర్శనం అనంతరం ఆయన కోణార్క్‌ లోని సూర్య దేవాలయాన్ని దర్శించేందుకు బయలుదేరి వెళ్లారు.

Puri
KCR
Jagannath
Odisha
  • Loading...

More Telugu News