Telangana: కొత్తగూడెం టీఆర్ఎస్ సమావేశం రసాభాస.. సొంత మనుషులే ఓడించారని జలగం వర్గీయుల ఆందోళన!

  • తాజా ఎన్నికల్లో జలగం వెంకట్రావు ఓటమి
  • టీఆర్ఎస్ నేతలే కారణమన్న అనుచరులు
  • కార్యకర్తలను సముదాయించిన నరేశ్ రెడ్డి

తెలంగాణలోని కొత్తగూడెంలో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారకులైన వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జలగం వెంకట్రావు వర్గీయులు డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు సొంత పార్టీ నేతనే కుట్ర పన్ని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కొత్తగూడెం అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఆయన పరాజయం చెందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటికీ ఆయనకు ఈసారి పరాజయం ఎదురయింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో పార్టీ పరిశీలకుడు నరేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో వెంకట్రావు వర్గీయులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో అందరినీ సముదాయించిన నరేశ్ రెడ్డి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Telangana
Telangana Assembly Results
jalagam
ventkatarao
TRS
kottagudem
Bhadradri Kothagudem District
  • Loading...

More Telugu News