Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి ఒక జవాను మృతి

  • బస్సులో ప్రయాణిస్తున్న ఐటీబీపీ సభ్యులు
  • రాంబన్‌ జిల్లాలో ఘటన
  • ఖునీనల్లా ప్రాంతం వద్ద అదుపుతప్పిన బస్సు

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం రాంబన్‌ జిల్లా ఖునీనల్లా ప్రాంతంలో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ) ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో ఒక జవాను మృతి చెందాడు. మరో 34 మంది గాయపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసులు సోమవారం బుద్గామ్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో బస్సు అదుపుతప్పి లోయవైపు పడిపోయింది.

అయితే, అదృష్టవశాత్తు బస్సు లోయలోకి పడిపోకుండా చెట్లు అడ్డుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయానికి బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉండగా వీరిలో ఒకరు చనిపోయారు. మిగిలిన వారిని భద్రతా సిబ్బంది, స్థానికులు రక్షించి లోయలో నుంచి బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Jammu And Kashmir
ramban disrict
Road Accident
javan died
  • Loading...

More Telugu News