Jagan: క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జగన్

  • తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలిపిన జగన్ 
  • మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశాలనిచ్చారు
  • పండగని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Telangana
Christmas
  • Loading...

More Telugu News