CPM: సీనియర్‌ సీపీఎం నేత నిరుపమ్‌ సేన్‌ కన్నుమూత!

  • సుదీర్ఘ కాలంగా అస్వస్థత
  • గుండెపోటుతో మృతి
  • బుధవారం నాడు అంత్యక్రియలు

దిగ్గజ వామపక్ష నేత, సీపీఎం నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి నిరుపమ్‌ సేన్‌ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, కోల్ కతాలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్ర గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

 సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఎంతో కాలం సేవలందించిన ఆయన, పశ్చిమ బెంగాల్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిగానూ పనిచేశారు. నిరుపమ్ భౌతికకాయాన్ని బుధవారం నాడు కోల్ కతా సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తామని, అక్కడ ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల తుది నివాళుల అనంతరం, ఆయన స్వస్థలమైన బుర్ద్వాన్‌ పట్టణంలో అంత్యక్రియలు జరుపుతామని కుటుంబీకులు వెల్లడించారు. నిరుపమ్ సేన్ మృతిపట్ల పలువురు వామపక్ష నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు. 

CPM
Nirupam Sen
Died
Heart Attack
  • Loading...

More Telugu News