Sabarimala: బిందు, దుర్గలను బలవంతంగా కొండదించిన మహిళా పోలీసులు!

  • పోలీసులు నచ్చజెప్పినా వెనుదిరగని మహిళలు
  • మరక్కూటం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • అరెస్ట్ చేసి, తరలించిన అధికారులు

శబరిమలకు వచ్చి, స్వామి దర్శనం కల్పించాలని నిరసన తెలుపుతున్న 50 ఏళ్ల లోపు మహిళలు బిందు, దుర్గలను మహిళా పోలీసులు బలవంతంగా కిందకు దించారు. సన్నిధానానికి కిలోమీటర్ దూరంలోని మరక్కూటం వద్ద ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. వారంతట వారుగా కిందకు వెళ్లాలని, పరిస్థితులు సద్దుమణిగిన తరువాత స్వామి దర్శనానికి మరోమారు రావచ్చని పోలీసు ఉన్నతాధికారులు వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు.

అయితే, ఎంతసేపు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో మహిళా పోలీసులు, వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, బలవంతంగా పంబకు చేర్చారు. అక్కడి నుంచి వారిని నీలక్కల్ కు పంపించనున్నామని, ఆలయం వద్ద పరిస్థితి ప్రశాంతంగానే ఉందని అధికారులు ప్రకటించారు. ఇద్దరు మహిళలూ వెనుదిరిగారని తెలుసుకున్న భక్తులు, నిరసనలను ముగించారని తెలిపారు.

Sabarimala
Ayyappa
Arrest
Bindu
Durga
  • Loading...

More Telugu News