farmars: రైతులకు రుణమాఫీపై.. ఎం.ఎస్.స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు!
- దేశవ్యాప్తంగా ఈ ధోరణి పెరుగుతోంది
- రాజకీయం కోసం మాఫీ చేస్తున్నారు
- దీన్ని ప్రోత్సహించకూడదని వ్యాఖ్య
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రైతులకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ ,రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం రైతుల అప్పులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇదే తరహా ధోరణి పెరుగుతుండటంపై ప్రముఖ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ సంక్షోభం ఆర్థికపరమైనదని స్వామినాథన్ తెలిపారు. వ్యవసాయ విధానంలో రుణమాఫీ భాగం కాకూడదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాలు, లబ్ధి కోసం నాయకులు రుణమాఫీని ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు. రుణాలను చెల్లించలేని, తీవ్రంగా నష్టపోయిన రైతులను మాత్రమే రుణమాఫీ కింద ఆదుకోవాలని చెప్పారు.