navin patnaik: లోక్ సభ ఎన్నికలపై ఇంకా దృష్టి సారించలేదు: నవీన్ పట్నాయక్

  • ఇద్దరం పలు అంశాలపై చర్చించాం
  • జాతీయ ప్రయోజనాల దిశగా చర్చలు జరిగాయి
  • మాది ఫెడరల్ ఫ్రెండ్ షిప్

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దేశ పర్యటనను ప్రారంభించిన కేసీఆర్... తొలుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితం వీరి భేటీ ముగిసింది. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, భావసారూప్యం ఉన్న పార్టీల స్నేహ బంధంతో పాటు పలు అంశాలపై ఇరువురం చర్చించామని తెలిపారు. జాతీయ ప్రయోజనాల దిశగా తమ చర్చలు జరిగాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, పూరి జగన్నాథుడికి పూజలు చేయడానికి కేసీఆర్ ఒడిశాకు వచ్చారని తెలిపారు. లోక్ సభ ఎన్నికలపై ఇంకా దృష్టి సారించలేదని చెప్పారు. తమది ఫెడరల్ ఫ్రెండ్ షిప్ అని తెలిపారు.

navin patnaik
kcr
TRS
bjd
odisha
  • Loading...

More Telugu News