kcr: భువనేశ్వర్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం.. రాత్రికి నవీన్ పట్నాయక్ నివాసంలో బస

  • భువనేశ్వర్ చేరుకున్న కేసీఆర్
  • కాసేపట్లో నవీన్ పట్నాయక్ తో భేటీ
  • ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ

ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర సంస్కృతి సమితి శాఖ ప్రతినిధులు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ భేటీ కానున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ రాత్రికి నవీన్ పట్నాయక్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథుడి ఆలయాలను దర్శించుకుంటారు. అనంతరం భువనేశ్వర్ నుంచి కోల్ కతా బయలుదేరుతారు. అక్కడ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన భేటీ అవుతారు.

kcr
bhuvaneshwar
naveen patnaik
TRS
  • Loading...

More Telugu News