nitin gadkari: నాపై భారీ కుట్ర జరుగుతోంది: నితిన గడ్కరీ

  • పార్టీకి, తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు
  • నాపై వేస్తున్న నిందలను ఖండిస్తున్నా
  • దుష్ట పన్నాగాలను బయటపెడతా

పార్టీ అధిష్ఠానానికి, తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు భారీ కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కొన్ని విపక్ష పార్టీలు, ఓ వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని విమర్శించారు. తనను, బీజేపీని అప్రతిష్ఠపాలు చేసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. వారి ప్రయత్నాలు సఫలీకృతం కాబోవని అన్నారు. తనపై వేస్తున్న నిందలను ఖండిస్తున్నానని, వారి దుష్ట పన్నాగాలను బయటపెడతానని చెప్పారు.

ఎన్నికల్లో గెలుపొందితే తామే సాధించామని చెప్పుకోవడానికి నేతలు ముందుంటారని... ఓటమికి కూడా బాధ్యత తీసుకోవడం గురించి నేతలు ఆలోచించాలని నిన్న గడ్కరీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. మూడు రాష్ట్రాల్లో ఓటమి నేపథ్యంలో, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై పరోక్షంగా గడ్కరీ విమర్శలు గుప్పించారని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నేడు గడ్కరీ ఈ మేరకు స్పందించారు.

nitin gadkari
modi
amit shah
bjp
  • Loading...

More Telugu News