lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ పరమ చెత్తగా ఉంది.. రెండు రోజులకు మించి సినిమా ఆడదు: కత్తి మహేష్

  • వర్మ ట్రైలర్ లో అరుపులు, కేకలు తప్ప మరేమీ లేవు
  • ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుంది
  • వర్మ సినిమాకు టీడీపీ నేతలు అనవసరంగా ప్రచారం కల్పిస్తున్నారు

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ పరమ చెత్తగా ఉందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. ట్రైలర్ లో అరుపులు, కేకలు తప్ప మరేమీ లేదని అన్నారు. అనవసరంగా టీడీపీ నేతలు ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటే మంచిదని సూచించారు.

 వర్మ సినిమా రెండు రోజులకు మించి ఆడదని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందని తెలిపారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. కాకపోతే, యంగ్ ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ బదులు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వైసీపీ అభిమానులు మద్దతు పలకడం కూడా వేస్ట్ అని కత్తి మహేష్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' సినిమాను ప్రమోట్ చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని... వారి సినిమాలు పార్టీలకు అతీతంగా ఆదరణను చూరగొంటాయని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నది వైసీపీ నాయకుడనే విషయంపై స్పందిస్తూ... ఈ సినిమాను అడ్డం పెట్టుకుని, సదరు నిర్మాత జగన్ ను టికెట్ అడిగే అవకాశం ఉందని అన్నారు. 

lakshmis ntr
rgv
varma
kathi mahesh
ntr biopic
krish
Balakrishna
junior ntr
tollywood
trailer
  • Loading...

More Telugu News