kcr: శారదా పీఠం ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్

  • విశాఖ శారదా పీఠంలో కేసీఆర్ పూజలు
  • కుటుంబంతో కలసి ఆశ్రమంలో భోజనాన్ని స్వీకరించిన కేసీఆర్
  • సాయంత్రం 4.30 గంటలకు భువనేశ్వర్ కు పయనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖలోని శారదా పీఠం ఆశ్రమంలో పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఆశ్రమానికి చేరుకున్న కేసీఆర్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి స్వరూపానంద ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న విజయ హనుమాన్ కు, శమీ వృక్షానికి కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలసి ఆశ్రమంలోనే ఆయన మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పొలిటికల్ సెక్రటరీ సుభాష్ రెడ్డిలు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం నుంచి ఆయన భువనేశ్వర్ కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విశాఖకు రావడం ఇదే తొలిసారి.

kcr
visakhapatnam
sarada peetham
TRS
  • Loading...

More Telugu News